అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోతకు సిద్ధమైపోయారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో దేశాలపై సుంకాల విధింపునకు ట్రంప్ రెడీ అయ్యారు. ఆయా దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై 30 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వచ్చే నెల (ఆగస్ట్) ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

