
హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి వై పురాన్ కుమార్ అక్టోబర్ 7న సూసైడ్ చేసుకున్నారు. మరణానికి ముందు రాసిన 9 పేజీల సూసైడ్ నోట్ ఆయన జేబులో లభ్యమైంది. ఇందులో 12 మంది అధికారులు తనను మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించారు. హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా తన భర్తపై మానసిక వేధింపులు, కుల ఆధారిత వివక్ష, హింసకు పాల్పడ్డారని ఆయన భార్య ఐఏఎస్ అమ్నీత్ పి కుమార్ ఆరోపించారు.