
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ టికెట్ రేట్ల పెంపు విషయంలో అంత సుముఖంగా లేరన్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన తరువాత పరిణామాలన్నీ మారాయి. అదనపు షోలు, ఫ్యాన్స్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అనే మాట కూడా ఎత్తడం లేదన్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి టైంలో హరి హర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.