
ఆదిలాబాద్‌కు చెందిన సాయి చైతన్య జాదవ్ కూడా అలాంటి కుర్రాడే. మంగళవారం యూపీఎస్సీ (UPSC) విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 68వ ర్యాంక్ కొల్లగొట్టాడీ యువకెరటం. తెలంగాణ రాష్ట్రం గర్వపడే విజయం సాధించిన చైతన్య ఏం అంటున్నారంటే.. మాది ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలోని పల్సిబి గ్రామం. సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో టాప్ 100లో ఉంటానని అనుకున్నా. కానీ, 68 ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. ఇది నా ఆరో ప్రయత్నం. నా కలల కొలువు కోసం 2019 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను.
- 0 Comments
- Adilabad District