వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. డివైజ్‌లో సిమ్‌కార్డు ఉంటేనే యాప్ పనిచేసేలా చూడాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశించింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025లో భాగంగా యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలందించే సంస్థలకు ఈ మేరకు డాట్ ఆదేశాలు జారీ చేసింది. 90 రోజుల్లో ఈ నిబంధనలను అమలు చేయాలని పేర్కొంది.

