
సెమికాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్‌కు ముందు, అమెరికాకు చెందిన సిన్క్లేర్ సంస్థ భారతదేశంలో తయారైన డైరెక్ట్ టు మొబైల్ (D2M) చిప్ ఆధారిత టాబ్లెట్‌ను ప్రదర్శించింది. ఈ చిప్‌ను సాంక్య ల్యాబ్స్ అభివృద్ధి చేయగా.. ఇది ఇంటర్నెట్ లేకుండానే టీవీ ప్రసారాలను నేరుగా మొబైల్ ఫోన్‌లకు అందించగలిగే ప్రపంచంలోనే మొదటి టెక్నాలజీ. చిప్‌లో ఉపయోగించిన ప్రుత్వి-3 ATSC 3.0 చిప్‌సెట్ భారత శాస్త్రవేత్తల తేజస్సుకు గొప్ప ఉదాహరణ.