టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసు లో ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోయాడు. నాంపల్లి కోర్టులో సోమవారం అతడు సరెండర్ అయ్యాడు. 24 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న అతడు.. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయాడు. ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి, ఆమె కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. చికిత్స పొందుతూ ప్రత్యూష 2022 ఫిబ్రవరి 23న మరణించగా.. సిద్దార్ధ్ ప్రాణాలతో బయటపడ్డాడు. తన కూతురు ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్య అని ఆమె తల్లి కేసు వేసింది.

