కర్నాటక హైకోర్టులో సిద్ధరామయ్య సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ప్రభుత్వ ప్రాంగణాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని.. నిర్వహించే ముందు ప్రైవేటు సంస్థలు పరిపాలనా అనుమతులు పొందాలని కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఉత్తర్వులను కర్నాటక హైకోర్డు ధార్వాడ్ బెంచ్ ఉత్తర్వులు నిలిపివేసింది. పునస్చైతన్య సేవా సమస్త అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసింది.

