
భారత 52వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. మే 13న ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో గవాయి మే 14న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత రాజ్యాంగం అధికారాల ప్రకారం ఈ నియామకం జరిగిందని ధృవీకరిస్తూ.. కేంద్ర న్యాయ, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు