సికింద్రాబాద్‌లో లష్కర్ జిల్లా సాధన సమితి సమావేశంలో తలసాని మాట్లాడుతూ. పేర్లు మారుస్తానని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలని గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరైనా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. మన తండ్రి, తల్లి పేరు మారిస్తే ఊరుకుంటామా అని మండిపడ్డారు. మన ప్రాంతం పేరు మార్చడానికి వీళ్లేవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ఇష్టానుసారం చేస్తానంటే నడవదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

