
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం, చందనోత్సహం చూడాలని వెళ్తే ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు పోవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మదురవాడ చంద్రంపాలెం మృతి చెందిన భార్య భర్తలు.. పిళ్ళా ఉమా మహేశ్వరావు(30)., పిల్లా శైలజ(29) లతో పాటు శైలజ తల్లి పైలా వెంకట రత్నం, మేనత్త గుజ్జారి మహాలక్ష్మి మృతి చెందారు. వీరు ఇసుక తోట ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఉమామహేశ్వర్ రావు, శైలజ (దంపతులు )సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు.