
సింగరేణి కార్మికులకు చెల్లించే బోనస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. దసరా పండుగ వేళ కార్మికులకు తీపి కబురు చెప్పాల్సింది పోయి, చేదు వార్తతో వారిని తీవ్ర నిరాశకు గురిచేశారని మండిపడ్డారు. సంస్థకు వచ్చిన మొత్తం లాభం రూ.6,394 కోట్లను కాకుండా, కేవలం రూ. 2,360 కోట్ల నుంచి మాత్రమే బోనస్ లెక్కించడం దారుణమని అన్నారు. పంచాల్సిన వాటాను తగ్గించి కార్మికులను ప్రభుత్వం వంచిస్తోందని విమర్శించారు.