
వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో సింగపూర్‌తో పాటు మలేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు హాజరయ్యారు. సింగపూర్‌లో 40 వేల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారని సీఎం తెలిపారు. వారు తమ కర్మభూమి అభివృద్ధికి సహకరించాలి కానీ, పుట్టిన గడ్డను మాత్రం మరవకూడదని అన్నారు.భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.