అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ఇండియన్ మిలిటరీ అకాడమీ’ (ఐఎంఏ) నుంచి మొట్ట మొదటిసారిగా ఓ మహిళా అధికారి పాసయ్యారు. 93 సంవత్సరాల ఐఎంఏ చరిత్రలో తొలిసారిగా ఈ అరుదైన ఘనతను మహారాష్ట్రలోని కొల్హాపూర్ వాస్తవ్యురాలు సాయి జాధవ్ సొంతం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దెహ్రాదూన్‌లో ఉన్న ఈ అకాడమీలో దాదాపు 6 నెలల కఠిన సైనిక శిక్షణను ఆమె పూర్తి చేసుకొని సైన్యంలో చేరారు. ఐఎంఏ నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళా సైనిక అధికారిణిగా నిలిచారు.

