జనగణన 2027 నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. సహజీవన జంటలకు సైతం కుటుంబ హోదా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. చాలాకాలం నుంచి సహ జీవనం చేస్తున్న వారిని సైతం ఒకే ఫ్యామిలీగా గుర్తించి కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. భారత్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జనగణన (సెన్సస్ 2027) ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈసారి జనగణనను పూర్తిస్థాయిలో డిజిటల్ మాధ్యమాల ద్వారా నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

