నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట సర్పంచ్ దుర్గం లహరిక (31)కు కొద్దిరోజులుగా భర్త రాజేశ్‌తో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన లహరిక శుక్రవారం ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా నచ్చన్ఎల్లాపూర్ వద్ద వీరు ప్రయణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ట్రాక్టర్ నాగళ్లను ఢీకొట్టింది. ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

