గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలుర గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థులు మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. మంచి భోజనం పెట్టాలని ప్రశ్నిస్తే కొడుతున్నారని.. బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. నాణ్యత లేని భోజనం గురించి ప్రశ్నించినందుకు ఉపాధ్యాయుడు కొడుతున్నాడని.. ఈ విషయంలో ప్రిన్సిపల్ అతన్ని వెనుకేసుకొస్తున్నాడని విద్యార్థులు తెలిపారు

