
తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు మరో అడుగు ముందుకు పడింది. ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిష్కారం లభించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో మాట్లాడి అనుమానాలు నివృత్తి చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌తో సమావేశమయ్యారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చెల్లించే నష్టపరిహారం ఇచ్చేందుకు తెలంగాణ ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ప్రాజెక్టుకు NOC ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం జరుగుతోంది.