
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చలో హరీశ్ రావు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. 660 పేజీల నివేదికపై అరగంటలో చర్చ సాధ్యమా? అని ప్రశ్నిస్తూ.. కనీసం రెండుగంటల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రాజకీయ ప్రేరణతో తయారైన డొల్ల రిపోర్టుగా అభివర్ణించారు. 8బి నోటీసుల్లేకుండా నివేదిక ఇవ్వడం చట్ట విరుద్ధం అని, కోర్టుకు వెళ్లడం రాజ్యాంగ హక్కు అని సభలో చర్చ వద్దని ఎప్పుడూ చెప్పలేదని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.