
కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలకు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ముఖ్యంగా, జగన్ సినీనటుల పట్ల చూపిన గౌరవాన్ని చిరంజీవి వంటి ప్రముఖులు ఇప్పటికే బహిరంగంగా వెల్లడించారని వారు గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, విరూపాక్షి, శివప్రసాద్ రెడ్డి తదితరులు అసెంబ్లీలోనే కామినేని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.