ICC మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన ఇచ్చింది. రీప్లేస్‌మెంట్‌గా వచ్చి 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి..ఊహించని బౌలింగ్ స్పెల్‌లో 2 కీలక వికెట్లు తీసి మ్యాచ్ గమనం మార్చింది. బ్యాటింగ్‌లోనే కాకుండా ఊహించని బౌలింగ్‌తోనూ సఫారీలకు ఔటాఫ్ సిలబస్ గా నిలిచింది షెఫాలి. ఒక మ్యాచ్ గమనాన్ని మార్చడానికి ఒక ప్లేయర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ రెండూ ఎలా ఉపయోగపడతాయో షెఫాలీ నిరూపించింది

