ప్రపంచ టెక్ రంగంలో అత్యంత సంపన్న సీఈవోలు భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్. ప్రస్తుతం ఆ స్థానాన్ని వారు కోల్పోయారు. తాజా నివేదికల ప్రకారం ఈ ఇద్దరినీ వెనక్కి నెట్టి అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. టెక్ సీఈవోల్లో జయశ్రీ రూ.50,170 కోట్ల నికర విలువతో ఉల్లాల్ అగ్రస్థానంలో నిలిచారు. కెరీర్ తొలినాళ్లలో పలు సంస్థల్లో పనిచేసిన జయశ్రీ.. 2008 నుంచి కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ అయిన అరిస్టా నెట్వర్క్స్కు నాయకత్వం వహిస్తున్నారు.

