
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో దేశానికి సేవ చేసే గొప్ప సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అని పవన్ కొనియాడారు. క్రమశిక్షణ, సేవ, జాతీయత మొదలైన అంశాలలో అద్భుతమైన నిబద్ధతను చూపిన ఆర్‌ఎస్ఎస్ పవిత్రమైన విజయదశమి రోజున వంద అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు