
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ అమలు, దశల వారీగా అభివృద్ధి, క్షేత్ర అభివృద్ధి కోసం అటవీ శాఖ అభ్యంతరాలు తదితర అంశాలు, విస్తరణపై చర్చించనున్నారు.