భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలను భక్తులకు ఇంటి వద్దకే అందించనుంది. భక్తులు ఆర్టీసీ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే డోర్ డెలివరీ చేయనుంది. టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవల ద్వారా ఈ సదుపాయం కల్పిస్తున్నామని, భక్తులు వినియోగించాలని అధికారులు స్పష్టం చేశారు. కేవలం రూ.151 చెల్లించి ఆర్డర్ పెట్టుకుంటే కళ్యాణ తలంబ్రాలను నేరుగా మీ ఇంటి వద్దకే తెచ్చి అందిస్తామని టీజీఎస్ఆర్టీసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

