శ్రీరామనవమి సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. 12 గంటల పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. పోలీసులు వెల్లడించారు. ఈ శ్రీరామనవమి శోభాయాత్ర సీతారాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై.. కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనుంది. ఈ నేపథ్యంలోనే సీతారాంబాగ్-కోఠి మార్గంలో వాహనాలు వెళ్లేందుకు అనుమతులు నిరాకరించనున్నారు.

