ప్రపంచకప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు రాష్ట్రానికి చెందిన శ్రీచరణికి విజయవాడలో ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు క్రికెటర్ శ్రీచరణి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వరల్డ్‌కప్ గెలిచిన క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణికి ప్రభుత్వం నజరానా ప్రకటించింది. శ్రీచరణికి గ్రూప్1 ఉద్యోగంతోపాటు రూ. 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే శ్రీచరణికి కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపింది.

