శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు తాపడాల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తాజాగా ఈ కేసులో గణనీయమైన పురోగతిని సాధించింది. బంగారు తాపడాల నుంచి వేరు చేసిన స్వర్ణాన్ని బళ్లారిలోని నగల వ్యాపారి గోవర్ధన్‌కు విక్రయించినట్లు, ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి తన వాంగ్మూలంలో వెల్లడించాడు. విచారణలో ఉన్నికృష్ణన్ పొట్టి దేవస్థానానికి చెందిన బంగారాన్ని తనకు విక్రయించాడని గోవర్ధన్ అంగీకరించాడు. దాదాపు 476 గ్రాముల బంగారాన్ని . తిరిగి రికవరీ చేయాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది.

