
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శబరిమలకు వెళ్లారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పంపాలో తన పాదాలను కడుక్కోవడం ద్వారా సాంప్రదాయ శుద్ధి ఆచారాన్ని పాటించారు.
అనంతరం ఆమె గణపతి ఆలయంలో ఇరుముడిని సిద్ధం చేసుకుని, సన్నిధానంకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తరువాత రాష్ట్రపతి 18 పవిత్ర మెట్లు ఎక్కి అయ్యప్పకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.