మరోసారి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. శనివారం రాత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఇటీవలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ 2025కు సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఎంపికయ్యారు. ఈ పర్యటనలో భాగంగా నవంబర్ 4వ తేదీన జరిగే అవార్డుల కార్యక్రమంలో పాల్గొనిఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్‌లో హెరిటేజ్ ఫుడ్స్ గోల్డెన్ పీకాక్ అవార్డును ఆమె అందుకోనున్నారు.

