ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా సూరంపల్లిలో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూనే, రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఆయన ఎండగట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో సమయాన్ని వృథా చేయడం వల్ల ప్రాజెక్టు అనాథగా మారింది. కేవలం రాజకీయ స్వార్థం కోసం ప్రాజెక్టు పనులను అస్తవ్యస్తం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టారు” అని ఆయన మండిపడ్డారు.’

