నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,డిప్యూటీ మేయర్ సయద్ తహ్సీన్‌తో నేతృత్వంలో 40 మంది కార్పొరేటర్లు కలెక్టర్‌కు నోటీసు ఇచ్చారు. 2024 జూన్‌లోనే మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఆమె కూటమి పార్టీలు ఆహ్వానించలేదు. కానీ ఇటీవల స్రవంతి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో భేటీ అవడంతో ఆమెను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.

