
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పలు అంశాలపై వైసీపీ వైఖరిని తప్పుబట్టారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. అసలు ఆ పార్టీ నాయకులకు బుద్ధుందా అంటూ మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు.. తాము కాదని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫేక్ రాజకీయాలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని, ఎరువుల కొరత సృష్టించినా తప్పుడు ప్రచారం చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.