
ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు ఏకంగా సుమారు 54 లక్షల రూపాయలు అధికారులు కాజేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైరా మున్సిపాలిటిలోని ఇంజనీరింగ్ శాఖ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ కేంద్రంగా ఈ అవినితి వ్యవహరం కొనసాగింది. మున్సిపాలిటి జనరల్ ఫండ్ రూ.2 కొట్ల నిధులలో సుమారు 54 లక్షల రూపాయలు గోల్మాల్ జరగడం ప్రకంపనలకు దారితీస్తుంది. జేఏఓ కిరణ్ మున్సిపాలిటి అవినితిపై రాష్ట్ర, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారుల బాగోతం బహిర్గతమైంది.