
వైట్ హౌస్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొని, భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.దీపాల పండుగ చీకట్లపై వెలుగుల విజయాన్ని సూచిస్తుందని పేర్కొంటూ ఈ సందర్భంగా ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇటీవల వాణిజ్య సంబంధాలపై మాట్లాడినట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక బంధం మరింత బలపడేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు