
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ, రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్దమైంది. శ్రీవారి ఆలయం ముందు రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ ఆరోపణలు చేశారని విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ఇటీవల పాలకమండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అలాగే శ్రీవారి ఆలయం ముందు , మాడ వీధుల్లో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కూడా టీటీడీ హెచ్చరించింది.