బస్సు ప్రమాద ఘటన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. ఈరోజు (సోమవారం) ఉదయం ముగ్గురు అక్కా చెల్లెళ్లను కన్న తండ్రి స్వయంగా బస్టాప్‌లో దింపి వెళ్లాడు విషయం తెలిసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అక్టోబర్ 15న పెద్ద కుమార్తె వివాహం జరిగింది. ఒక కుమార్తెకు వివాహం కాగా ముగ్గురు కుమార్తెలు బస్సు ప్రమాదంలో మృతి చెందారు. ముగ్గురు కూడా హైదరాబాద్‌లో బీటెక్ మూడు, రెండవ, మొదటి సంవత్సరం చదువుతున్నారు. మృతులు సాయిప్రియ, తనుషా, నందినిగా గుర్తించారు.

