
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్నపై భరోసా ఉంచుకుని, రాష్ట్ర అభివృద్ధి కోసం అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతానని ధీమా వ్యక్తం చేశారు. కరవు బారిన పడే రాయలసీమను సస్యశ్యామలంగా, రత్నాల సీమగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని ఆయన పేర్కొన్నారు. “మేము 2014 నుంచి 2019 మధ్య రాయలసీమ ప్రాజెక్టులకు ₹12,500 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ గత ఐదేళ్లలో వైసీపీ కేవలం ₹2,000 కోట్లతోనే సరిపెట్టింది. అభివృద్ధి, సంక్షేమంలో దమ్ముంటే పోటీ పడాలి” అని సవాల్ విసిరారు.