
ప్రభుత్వంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కొందరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలను వదిలి హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని వీకెండ్ రాజకీయాలు చేయొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ హితవు పలికారు. ఎవరెవరూ ఏం మాట్లాడుతున్నారన్నది అంతా రికార్డ్ అవుతూ ఉందని జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే తన జీతం నుంచి రూ.25 వేలు పార్టీకి ఇవ్వాలని సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. కార్యకర్తలు, పార్టీ నేతలు కాంగ్రెస్ కోసం పనిచేయాలని సిఎం రేవంత్ సూచించారు.