ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం రోజున జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు గల్లంతయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జంఝావతి రబ్బర్ డ్యామ్‌లో వద్దకు పిక్నిక్ కోసమని వెళ్లారు.డ్యాంలో ఈతకొట్టేందుకు దిగి ప్రమాదవశాత్తూ డ్యామ్‌లో మునిగి గల్లంతయ్యారు. అనంతగిరి మండలం జీనబాడు వద్ద ఉన్న రైవాడ రిజర్వాయర్ వద్ద ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం పోలీసులు గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు.

