
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సిఫీ టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తున్న ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు (సీఎల్ఎస్) మంత్రి లోకేశ్ ఆదివారం శంకుస్థాపన చేశారు. వివరాలు. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖలో 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాలలో రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్‌ను సిఫీ అభివృద్ధి చేయనుంది.