
వివాహం కోసం అమెరికాకు వచ్చిన 24 ఏళ్ల భారతీయ యువతి అదృశ్యమైంది. ఆమె పేరు సిమ్రాన్, అమెకు ఇంగ్లీషు భాష తెలియదు. బంధువులు కూడా ఎవరు వెంటలేరు. అమెరికా లో కూడా ఆమెకు తెలిసిన బంధువులు ఎవరూ లేరని తెలిసింది. జూన్ 20న భారతదేశం నుంచి న్యూజెర్సీకి చేరిన కొద్ది సేపటికే సిమ్రాన్ చివరిసారిగా కన్పించారు. సిమ్రాన్ న్యూజెర్సీకి వచ్చిన ఐదు రోజుల తర్వాత బుధవారంనాడు కనిపించకుండా పోయిందని పోలీసులు నిర్థారించారు. ఆమె కుదిర్చిన వివాహంకోసం అమెరికా వెళ్లినట్లు తేలింది