
టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. సోషల్‌మీడియాలో ఎప్పుడో ఒకసారి పోస్ట్ పెడుతుంటాడు. తాజాగా విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. తన భార్య అనుష్కతో కలిసి ఉన్న ఫొటోను విరాట్ షేర్ చేశాడు. ‘చాలాకాలం తర్వాత’ అంటూ ఆ పోస్ట్‌కి క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫొటో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. పోస్టు పెట్టిన 15 గంటల్లోనే దీనికి 9 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.