సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. అయితే, అతనికి నగదు బహుమతిగా కేవలం రూ. 10,000 మాత్రమే అందజేశారు. “కోహ్లీ కారు సర్వీసింగ్‌కు కూడా ఈ డబ్బు సరిపోదు” అని ఒకరు, “బీసీసీఐకి అంత కరువు వచ్చిందా?” అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్టార్ ఆడుతున్నప్పుడు ఈ మొత్తం చాలా చిన్నదిగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

