
అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛందంగా దేశం వీడాలనుకొనే వారికి విమాన టికెట్లు కొనిస్తాం, ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇస్తామని ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో అక్రమ వలసదారులకు స్వచ్ఛందంగా దేశాన్ని, వీడే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు.దీనిలో భాగంగా అలా వెళ్లేవారికి విమాన చార్జీలతో పాటు ఖర్చులకు కొంత మొత్తం ఇస్తామని చెప్పారు. వారు మంచిగా ఉంటే, మేము వారిని తిరిగి దేశానికి తీసుకురావాలనుకుంటే, వీలైనంత త్వరగా వారిని దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని,