
స్వదేశీ డిజిటల్ సాధనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తన అధికారులందరినీ అధికారిక వ్యవహారాల కోసం జోహో ఆఫీస్ సూట్‌ను ఉపయోగించాలని ఆదేశించింది. ఇది స్వదేశీ డిజిటల్ స్వావలంబన వైపు ఒక ప్రధాన అడుగుగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్లాట్‌ఫామ్ కంపెనీలు సంక్లిష్టమైన సెటప్ లేదా గణనీయమైన ఓవర్‌హెడ్ లేకుండా మొత్తం వర్క్‌ఫ్లోను డిజిటల్‌గా నిర్వహించడానికి అనుమతిస్తుంది.
జోహో.. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారిపోయింది.