శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో టీచర్ హాయిగా కుర్చీలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు టీచర్ సుజాతను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

