దేశంలో వాంటెడ్ అయిన పరారీ నేరస్తులు 70 మందికి పైగా విదేశాలలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024 25 సంవత్సరంలో వీరి ఆచూకిని కనుగొన్నట్లు అధికారిక నివేదికలో తెలిపారు. ఇక ఇదే సమయంలో ఇతర దేశాలకు చెందిన పరారీదార్లు 203 మంది వరకూ భారతదేశంలో ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్సనల్, ప్రజా సమస్యలు, పెన్షన్ల మంత్రిత్వశాఖ వెలువరించిన నివేదికలో స్పష్టం అయింది. వేరే దేశాలకు పారిపోయిన నేరస్తుల సంఖ్య పది సంవత్సరాల కాలంలో ఈసారి అత్యధికంగా ఉందని తెలిపారు.

