
అనుకున్న సమయానికి ఆరు గంటలు ఆలస్యంగా విజయ్ చేరుకోవడంతో ఆయనను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. విజయ్‌ను చూసేందుకు ఒక భవంతి పిట్టగోడపై పలువురు చేరడంతో పిట్టగోడ కుప్పకూలిందని,
దీంతో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. దీంతో కొంత గందరగోళం, తొక్కసలాట జరిగిందని తెలుస్తోంది. దీంతో విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపి వేశారు. వేదికపై నుంచి ‘పోలీస్ ప్లీజ్ హెల్ప్’అంటూ విజ్ఞప్తి చేశారు.