‘జన నాయగన్’ సినిమా గత డిసెంబరులోనే సెన్సార్ బోర్డుకు వెళ్లగా.. కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై అభ్యంతరాలతో సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేసి, మళ్లీ బోర్డుకు సమర్పించారట. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సెన్సార్ బోర్డు నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్ తరఫున మద్రాసు హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలైంది. దీనిపైనే బుధవారం వాదనలు జరిగాయి. తీర్పును జనవరి 9వ తేదీ ఉదయానికి రిజర్వ్ చేయడంతో, ఆ రోజు రిలీజయ్యే అవకాశాలు తక్కువే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

